Skip to main content

తెలంగాణ ప్రభుత్వ అప్పు లక్షా 80వేల కోట్లు

2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.1,80,239 కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
రాజ్యసభలో జూన్ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ అప్పు గత ఐదేళ్లలో 159 శాతం పెరిగిందనినిర్మలా చెప్పారు. 2014 జూన్ 2 నాటికి తెలంగాణ అప్పు రూ. 69,517 కోట్లుగా ఉంది.

తెలంగాణ అప్పులు, వడ్డీల వివరాలు(రూ. కోట్లలో)

ఆర్థిక సంవత్సరం

2014-15

2015-16

2016-17

2017-18

2018-19

మొత్తం రుణభారం

79,880

97,992

1,34,738

1,51,133

1,80,239

వడ్డీల చెల్లింపు

5,593

7,942

8,609

11,139

11,691


క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాన ప్రభుత్వం అప్పు రూ.1,80,239 కోట్లు
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Published date : 26 Jun 2019 06:04PM

Photo Stories