తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్
Sakshi Education
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ జూన్ 19నఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టులో నంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ను హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమిస్తూ మరో ఉత్తర్వు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగొయ్, జస్టిస్ బాబ్దే, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన కొలీజియం ఇటీవల చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించడంతో వాటికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో నోటిఫికేషన్ జారీ అయింది. ఈ జూన్ 22న సీజేగా జస్టిస్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చౌహాన్ నియమాకం
ఎవరు: జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
ఎప్పుడు: జూన్ 22న
ఎక్కడ: తెలంగాణ
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చౌహాన్ నియమాకం
ఎవరు: జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
ఎప్పుడు: జూన్ 22న
ఎక్కడ: తెలంగాణ
Published date : 20 Jun 2019 05:47PM