తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన వారు?
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ సి.పార్థసారథి నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన వారు
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : రిటైర్డ్ ఐఏఎస్ సి.పార్థసారథి
ఈ మేరకు సెప్టెంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు కమిషనర్‌గా ఉన్న వి.నాగిరెడ్డి 2020, ఏప్రిల్‌లోనే పదవీ విరమణ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లపాటు పార్థసారథి ఈ పదవిలో కొనసాగనున్నారు.
పార్థసారథి ప్రస్థానం...
- 1993 సర్వీస్ కేడర్ ఐఏఎస్ అధికారి పార్థసారథి బీఎస్సీ (అగ్రికల్చర్), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ (అగ్రికల్చర్)-ఆగ్రోనమి డిస్టింక్షన్‌లో పూర్తిచేశారు.
- 1988 డిసెంబర్ 4న విజయనగరం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు.
- ఐఏఎస్‌గా ఆదిలాబాద్ జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా అనంతపురం, వరంగల్ జిల్లాల జేసీగా విధులు నిర్వహించారు.
- 2004 జూన్ 19న కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, 2006 జూన్ 6న మార్క్‌ఫెడ్ ఎండీగా, ఆ తర్వాత ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌గా, 2011 జూన్ 18న ఏపీ స్టేట్ ఎయిడ్‌స కంట్రోల్ సొసైటీ పీడీగా బాధ్యతలు నిర్వహించారు.
- 2014 జూన్ 2న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, 2015 ఏప్రిల్ 15న వ్యవసాయశాఖ కమిషనర్‌గా, ఆ తర్వాత ముఖ్యకార్యదర్శిగా పదోన్నతి పొంది 2020, ఫిబ్రవరి 4వ తేదీ వరకు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు.
- ఆ తర్వాత ఈపీటీఆర్‌ఐ డెరైక్టర్ జనరల్‌గా బదిలీపై వెళ్లి, 2020, ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన వారు
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : రిటైర్డ్ ఐఏఎస్ సి.పార్థసారథి
Published date : 09 Sep 2020 05:47PM