టైమ్ తొలి కిడ్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన ఇండో అమెరికన్?
Sakshi Education
ఇండియన్ అమెరికన్ గీతాంజలి రావుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రఖ్యాత టైమ్ మేగజీన్ 15 ఏళ్ల గీతాంజలిని ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా గుర్తించింది.
తాగునీటి కాలుష్యం, డ్రగ్స్ వాడకం, సైబర్ వేధింపులు.. తదితర సమస్యలకు గీతాంజలి రావు టెక్నాలజీ సాయంతో పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారని ‘టైమ్’ ప్రశంసించింది. 5 వేల మందితో పోటీ పడి టైమ్ మేగజీన్ తొలి ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ గుర్తింపును గీతాంజలి సాధించింది. టైమ్ మేగజీన్ కోసం ఆమెను ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఆంజెలినా జోలి వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్ తొలి కిడ్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ఇండియన్ అమెరికన్ గీతాంజలి రావు
ఎందుకు : టెక్నాలజీ సాయంతో పలు సమస్యలకు పరిష్కారం చూపుతున్నందున
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్ తొలి కిడ్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ఇండియన్ అమెరికన్ గీతాంజలి రావు
ఎందుకు : టెక్నాలజీ సాయంతో పలు సమస్యలకు పరిష్కారం చూపుతున్నందున
Published date : 04 Dec 2020 06:08PM