Skip to main content

టైమ్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు?

భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ ఎదుగుతోన్న 100 మంది ప్రపంచ స్థాయి అత్యంత ప్రతిభావంతమైన నేతల పేర్లతో టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏడాది ‘‘ఎమర్జింగ్ లీడర్స్ హూ ఆర్ షేపింగ్ ద ఫ్యూచర్’’ పేరుతో జాబితాను విడుదల చేస్తోంది.
Current Affairs
2021 ఏడాదికి గాను రూపొందించిన జాబితాను ఫిబ్రవరి 18న విడుదల చేసింది. టైమ్ 100-2021 జాబితాలో ఐదుగురు భారత సంతతి ప్రముఖులు, ఒక భారతీయుడు చోటు దక్కించుకున్నారు.

ఏకైక భారతీయుడు...
భీం ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ టైమ్ 100 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ‘‘34 ఏళ్ల చంద్రశేఖర్ నడుపుతోన్న పాఠశాలలు విద్య ద్వారా దళితుల్లో పేదరికాన్ని పారదోలేందుకు కృషి చేస్తున్నాయి. కులపరమైన అణచివేత, హింసపై గళం విప్పుతూ, వివక్షకు వ్యతిరేకంగా భీం ఆర్మీ ఉద్యమిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై భీంఆర్మీ ఉద్యమించింది’’ అని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది.

ఐదుగురు భారత సంతతి ప్రముఖులు...
టైమ్ 100 జాబితాలో ఐదుగురు భారత సంతతి ప్రముఖులకు చోటు లభించింది. ఈ ఐదుగురిలో ట్విట్టర్ ఉన్నతస్థాయి న్యాయవాది విజయ గద్దె, యూకె ఆర్థిక మంత్రి రిషి సునక్, ఇన్‌స్టాకార్ట్ వ్యవస్థాపకులు-సీఈఓ అపూర్వ మెహతా, గెట్ యూఎస్ పీపీఈ వ్యవస్థాపకురాలు డాక్టర్ శిఖా గుప్తా, అప్ సాల్వ్ సంస్థ వ్యవస్థాపకుడు రోహన్ పావులూరి ఉన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : టైమ్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు?
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : భీం ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 20 Feb 2021 05:26PM

Photo Stories