స్వచ్ఛ భారత్‌లో ఏపీకి మూడు జాతీయ అవార్డులు
Sakshi Education
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుధ్య కార్యక్రమాలు అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మూడు అవార్డులు దక్కించుకుంది.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మొత్తం మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా మూడింటిలోనూ ఏపీ అవార్డులు సాధించింది.
కార్యక్రమాల అమలును పరిశీలించి...
స్వచ్ఛ భారత్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 2019, నవంబర్ 1 నుంచి 2020, సెప్టెంబర్ 15 వరకు మూడు విడతల్లో మూడు వేర్వేరు కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది.
ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌లో రెండో స్థానం...
ఎక్కువ గ్రామాల్లో కమ్యూనిటీ మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతోపాటు వాటి రోజువారీ నిర్వహణ సమర్థవంతంగా కొనసాగిస్తున్నందుకు ‘స్వచ్ఛ సుందర్ సముదాయిక్ శౌచాలయ్ (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్)’ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది.
- గ్రామాల్లో చెత్త, ఇతర వ్యర్థాలు నివాస ప్రాంతాల మధ్య లేకుండా పరిశుభ్రంగా ఉంచడంలో అమలు చేసిన కార్యక్రమాలకు ‘గందగీ ముక్త్ భారత్ (జీఎంబీ)’, ‘సముదాయిక్ శౌచాలయ్ అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ)’ కేటగిరీల్లో మూడో స్థానం సాధించింది.
చదవండి: స్వచ్ఛ భారత్‌లో వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
Published date : 03 Oct 2020 06:02PM