షూటింగ్ లో సౌరభ్-మను జంటకు స్వర్ణం
Sakshi Education
ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత షూటర్లు సౌరభ్ చౌధరీ-మను భాకర్ జంట స్వర్ణ పతకం గెలుచుకుంది.
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 27న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో సౌరభ్-మను జోడీ 483.4 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ ఈవెంట్‌లో రాన్‌జిన్ జియాన్-బోవెన్ జాంగ్ (చైనా-477.7 పాయింట్లు) జోడీ రజతం... మిన్‌జుంగ్ కిమ్-డేహన్ పార్క్ (కొరియా-418.8 పాయింట్లు) ద్వయం కాంస్యం సొంతం చేసుకున్నాయి.
ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్‌లో ఓవరాల్‌గా హంగేరి, భారత్ మూడు స్వర్ణాల చొప్పున సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. భారత షూటర్లు రెండు కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పడంతోపాటు ఒక ఒలింపిక్ బెర్త్‌ను దక్కించుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : సౌరభ్ చౌధరీ-మను భాకర్ జంట
ఎక్కడ : న్యూఢిల్లీ

Published date : 28 Feb 2019 05:05PM