సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సావంత్ కన్నుమూత
Sakshi Education
భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీ.బీ.సావంత్(90) కన్నుమూశారు.
గుండెపోటు కారణంగా పుణేలోని తన నివాసం ఫిబ్రవరి 15న తుదిశ్వాస విడిచారు. 1973లో బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన సావంత్.. 1989లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1995లో పదవీ విరమణ చేశారు. 2017లో జరిగిన ఎల్గార్ పరిషత్ సమావేశం కన్వీనర్లలో జస్టిస్ సావంత్ ఒకరు. 2002లో జరిగిన గుజరాత్ మతకలహాలపై ఏర్పరిచిన విచారణ కమిటీలోనూ ఆయన సభ్యులుగా ఉన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గానూ పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : పీ.బీ.సావంత్(90)
ఎక్కడ : పుణే, మహారాష్ట్ర
ఎందుకు : గుండెపోటు కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : పీ.బీ.సావంత్(90)
ఎక్కడ : పుణే, మహారాష్ట్ర
ఎందుకు : గుండెపోటు కారణంగా
Published date : 16 Feb 2021 05:43PM