సరకు రవాణాలో ఏపీకి మూడో ర్యాంకు
Sakshi Education
రాష్ట్రాల మధ్య సులభతర సరకు రవాణా (లాజిస్టిక్స్) సౌకర్యాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో ర్యాంకు లభించింది.
ఢిల్లీలో సెప్టెంబర్ 12న వాణిజ్య బోర్డు సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఏపీ ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లగ్ అండ్ ప్లే, నైపుణ్యాభివృద్ధి, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల క్లస్టర్ల అభివృద్ధిపై దృష్టిసారిస్తోందని.. కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా మేకపాటి కోరారు. మరోవైపు రాష్ట్రంలో గిరిజన ఒలింపిక్స్ నిర్వహించాలని కేంద్ర యువజన, క్రీడల మంత్రి కిరెన్ రిజ్జుకు మేకపాటి విజ్ఞప్తి చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రాల మధ్య సులభతర సరకు రవాణా (లాజిస్టిక్స్) సౌకర్యాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో ర్యాంకు
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రాల మధ్య సులభతర సరకు రవాణా (లాజిస్టిక్స్) సౌకర్యాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో ర్యాంకు
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
Published date : 13 Sep 2019 06:03PM