Skip to main content

శ్రీలంక క్రికెటర్ జయసూర్యపై రెండేళ్ల నిషేధం

శ్రీలంక విఖ్యాత క్రికెటర్ సనత్ జయసూర్యపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఫిబ్రవరి 26న రెండేళ్ల నిషేధం విధించింది.
ఈ నిషేధం 2018, అక్టోబర్ 16 నుంచి అమలవుతుందని ప్రకటించింది. 1996లో లంకకు వన్డే ప్రపంచకప్ అందించడంలో కీలకపాత్ర పోషించిన జయసూర్య ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించాడు. విచారణలో సహకరించకుండా, సాక్ష్యాల్ని ధ్వంసం చేసినట్లు ఏసీయూ ధ్రువీకరించింది. దీంతో అతనిపై రెండే ళ్ళపాటు నిషేధం విధించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
శ్రీలంక క్రికెటర్ జయసూర్యపై రెండేళ్ల నిషేధం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)
ఎందుకు : ఏసీయూ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు
Published date : 27 Feb 2019 05:48PM

Photo Stories