Skip to main content

శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా రాజపక్స ప్రమాణం

శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా గోటబాయ రాజపక్స నవంబర్ 18న ప్రమాణ స్వీకారం చేశారు.
సంప్రదాయాన్ని పక్కనపెట్టి శ్రీలంక రాజధాని కొలంబోలో కాకుండా, అనురాధపురలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ప్రాచీన బౌద్ధ ఆలయమైన రువన్‌వెలి సేయలో అధ్యక్షుడిగా రాజపక్స బాధ్యతలు చేపట్టారు. దీంతో రాజపక్స ఆ పదవిలో అయిదేళ్ల పాటు కొనసాగనున్నారు. నవంబర్ 17న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో రాజపక్స 52.25 శాతం ఓట్లను (6,924,255) సాధించగా, ఆయన ప్రత్యర్థి ప్రేమదాస రణసింఘే 41.99 శాతం ఓట్లను (5,564,239) సాధించారు. రాజపక్స కుటుంబం నుంచి 2005-15 మధ్య మహింద రాజపక్స అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన తమ్ముడే ఇప్పుడీ ఎన్నికల్లో గెలుపొందిన గొటబాయ. వివాదాస్పదుడిగానూ, ఎల్‌టీటీఈ తీవ్రవాదులను అణచివేసిన మిలిటరీ వార్ హీరోగానూ గొటబాయకు పేరుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : గోటబాయ రాజపక్స
ఎక్కడ : రువన్‌వెలి సేయ, అనురాధపుర, శ్రీలంక
Published date : 19 Nov 2019 05:04PM

Photo Stories