సొంతంగా సమాంతర రన్‌వే కల్గిన తొలి విమానాశ్రయం బీఎల్‌ఆర్ ఎయిర్‌పోర్టు
Sakshi Education
2019, డిసెంబర్ 6..!!! ఈ తేదీ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ చరిత్రలో నిలిచిపోనుంది.
విమానాశ్రయంలో కొత్త సౌత్ రన్‌వేను అధికారులు ప్రారంభించారు. డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం సుమారు 4 వేల మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పైన కొత్త రన్‌వేను బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవం ద్వారా దేశంలోనే సొంతంగా సమాంతర రన్‌వే కలిగిన తొలి విమానాశ్రయంగా బీఎల్‌ఆర్ ఎయిర్‌పోర్టు చరిత్రకెక్కింది. ఇప్పటి నుంచి ఒకేసారి రెండు రన్‌వే ద్వారా విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ తీసుకునేందుకు అవకాశం లభించింది. డిసెంబర్ 6న ఇండిగో విమానాన్ని సురక్షితంగా టేకాఫ్ చేసి రన్‌వేను బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ ఎండీ, సీఈవీఓ హరి మారర్ ప్రారంభించారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి: దేశంలోనే సొంతంగా సమాంతర రన్‌వే కల్గిన తొలి విమానాశ్రయం బీఎల్‌ఆర్ ఎయిర్‌పోర్టు
ఎప్పుడు: డిసెంబర్ 6, 2019
ఎక్కడ: బెంగళూరు
ఎందుకు: ఒకేసారి రెండు రన్‌వే ద్వారా విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ తీసుకునేందుకు అవకాశం
క్విక్ రివ్వూ:
ఏమిటి: దేశంలోనే సొంతంగా సమాంతర రన్‌వే కల్గిన తొలి విమానాశ్రయం బీఎల్‌ఆర్ ఎయిర్‌పోర్టు
ఎప్పుడు: డిసెంబర్ 6, 2019
ఎక్కడ: బెంగళూరు
ఎందుకు: ఒకేసారి రెండు రన్‌వే ద్వారా విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ తీసుకునేందుకు అవకాశం
Published date : 07 Dec 2019 05:11PM