Skip to main content

స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్‌కు టైటిల్

అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్) నిర్వహించిన ప్రపంచ టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ-ఆదిత్య మెహ్రా జంటకు టైటిల్ లభించింది.
మయన్మార్‌లోని మండలేలో సెప్టెంబర్ 25న జరిగిన ఫైనల్లో అద్వానీ-మెహ్రా జోడీ 5-2 ఫ్రేమ్‌ల తేడాతో పొంగ్సకార్న్-పొరమిన్ (థాయ్‌లాండ్) జంటపై విజయం సాధించింది. ఇటీవలే వ్యక్తిగత ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ నెగ్గిన అద్వానీ ఇప్పుడు 23వ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదిత్య మెహ్రాకు మాత్రం ఇదే తొలి టైటిల్.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : పంకజ్ అద్వానీ-ఆదిత్య మెహ్రా జంట
ఎక్కడ : మండలే, మయన్మార్
Published date : 26 Sep 2019 08:01PM

Photo Stories