సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు పునఃప్రారంభం
Sakshi Education
భారత్-పాక్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు మార్చి 3 నుంచి పునఃప్రారంభమయ్యాయి.
ఇరు దేశాల మధ్య పరస్పర అంగీకారంతో ఈ సేవలను పునరుద్ధరించినట్లు మార్చి 2న భారత రైల్వే తెలిపింది. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేసిన మరుసటి రోజే పాక్ సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
పాకిస్తాన్‌పై భారత వైమానిక దళం జరిపిన మెరుపుదాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే ఏకై క రైలు సంరతా ఎక్స్‌ప్రెస్‌ను పాక్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ కూడా గత నెల 28న సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు పునఃప్రారంభం
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : భారత రైల్వే శాఖ

Published date : 04 Mar 2019 05:48PM