Skip to main content

సంజయ్ సుబ్రమణ్యంకు డాన్ డేవిడ్ అవార్డ్

ప్రముఖ చరిత్రకారుడు సంజయ్ సుబ్రమణ్యంకు డాన్ డేవిడ్ అవార్డు లభించింది.
ఈ అవార్డును ఫిబ్రవరి 11న ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.మాక్రో హిస్టరీ (పూర్వకాలంలో ప్రపంచంలోని వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లోని సంస్కృతుల మధ్య సారుప్యత, వైవిధ్యం, వారధిలపై అధ్యయనం చేయడం)లో చేసిన విశేష పరిశోధనకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. అవార్డు కింద రూ.3.56 కోట్ల నగదు బహుమతిగా అందనుంది.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అధ్యాపకుడైన సంజయ్ క్రీస్తుశకం 1400-1800 సంవత్సరాల కాలంలో ఆసియన్లు, యూరోపియన్లు, స్థానిక, ఆధునిక అమెరికన్ల మధ్య సాంస్కృతిక సంబంధాలపై అధ్యయనం చేశారు. 2019, మే నెలలో జరిగే అవార్డు ప్రదాన కార్యక్రమంలో షికాగో యూనివర్సిటీ చరిత్రకారుడు కెన్నెత్ పొమెరాంజ్‌తో కలసి సంయుక్తంగా సంజయ్ ఈ అవార్డును అందుకోనున్నారు. కెన్నెత్‌కు కూడా రూ.3.56కోట్ల నగదు బహుమతిని అందజేస్తారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలతోపాటు భూత, భవిష్యత్, వర్తమానాల్లో మానవ విజయాలపై అధ్యయనం చేసేవారికి ‘ద డాన్ డేవిడ్ ఫౌండేషన్’ తరఫున టెల్ అవీవ్ యూనివర్సిటీ ఏటా ఈ అవార్డు అందిస్తోంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
డాన్ డేవిడ్ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : సంజయ్ సుబ్రమణ్యం
ఎందుకు : మాక్రో హిస్టరీలో చేసిన విశేష పరిశోధనకుగాను
Published date : 12 Feb 2019 04:52PM

Photo Stories