Skip to main content

స్మార్ట్ సిటీల మూడో శిఖరాగ్ర సదస్సు ముగింపు

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎంపిక చేసిన 100 స్మార్ట్ సిటీల మూడో శిఖరాగ్ర సదస్సు విశాఖపట్నంలో రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది.
Current Affairs‘ప్రజల కోసం.. నగరాల నిర్మాణం’ అనే థీమ్‌తో సాగిన ఈ సదస్సు జనవరి 25న ముగిసింది. ఈ సదస్సుకు 100 నగరాల నుంచి 25 మంది ప్రముఖులు, 192 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రాజెక్టుల స్థితిగతులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ల నిర్వహణ తదితర అంశాలపై సదస్సులో చర్చించారు.

విశాఖకు ఇన్నోవేషన్ ఐడియా అవార్డు
స్మార్ట్ సిటీస్ మూడో శిఖరాగ్ర సదస్సులో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వివిధ విభాగాల్లో ముందుకు దూసుకుపోతున్న స్మార్ట్ నగరాలకు పలు అవార్డులు ప్రకటించింది. 4 విభాగాల్లో 18 అవార్డులకు నగరాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు 3 అవార్డులు లభించగా.. ఇందులో 2 అవార్డులను విశాఖపట్నం, ఒక అవార్డును అమరావతి సొంతం చేసుకున్నాయి. ఇన్నోవేషన్ ఐడియా అవార్డుతో పాటు పెర్ఫార్మెన్స్ రికగ్నైజేషన్ విభాగంలో టైర్-1 సిటీస్‌లో విశాఖపట్నం అవార్డు సొంతం చేసుకోగా, టైర్-3 విభాగంలో అమరావతి అవార్డు దక్కించుకుంది. గవర్నెన్స్ థీమ్‌లో వడోదర, బిల్ట్ ఎన్విరాన్‌మెంట్ థీమ్‌లో ఇండోర్ నగరాలు అవార్డులు సొంతం చేసుకున్నాయి.
Published date : 27 Jan 2020 05:28PM

Photo Stories