Skip to main content

సియాచిన్ పర్యటనకు అనుమతి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమిగా పేరుగాంచిన జమ్మూకశ్మీర్‌లోని సియాచిన్‌పైకి పర్యాటకులను అనుమతినిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 21న వెల్లడించారు.
కునార్ బేస్ క్యాంప్ నుంచి కునార్ పోస్ట్ వరకు ఉన్న మార్గాలను తెరవనున్నట్లు తెలిపారు. లదాఖ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

సియాచిన్ విశేషాలు
  • సియాచిన్ అంటే ‘గులాబీ నేల’ అని అర్థం.
  • వ్యూహాత్మకంగా కీలకమైన సియాచిన్ ప్రాంతం నిజానికి ఒక హిమనీనదం.
  • సియాచిన్ సముద్రమట్టానికి దాదాపు 20వేల అడుగుల ఎత్తులో ఉంది. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 60 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. ఇక్కడ మంచు చరియలు విరిగిపడుతుంటాయి.
  • ఈ ప్రాంతంపై పట్టు కోసం భారత్, పాకిస్తాన్‌లు తీవ్రస్థాయిలో ప్రయత్నించాయి. 1984లో ‘ఆపరేషన్ మేఘ్‌దూత్’ పేరుతో సైనిక చర్య నిర్వహించిన భారత్ దీన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. దానికి ముందు వరకూ పర్వతారోహణ బృందాలను అక్కడ అనుమతించారు.
  • తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సైనికులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. గత పదేళ్లలో భారత్ ఇక్కడ 163 మంది సైనికులను కోల్పోయింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సియాచిన్ పర్యటనకు అనుమతి
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : సియాచిన్ యుద్ధక్షేత్రం, జమ్మూకశ్మీర్
ఎందుకు : లదాఖ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో
Published date : 22 Oct 2019 05:24PM

Photo Stories