Skip to main content

సీసీడీ తాత్కాలిక చైర్మన్‌గా రంగనాథ్

కాఫీ డే ఎంటర్‌ప్రెజైస్ (సీసీడీ) వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మరణం నేపథ్యంలో తాత్కాలిక చైర్మన్‌గా స్వతంత్ర డెరైక్టర్ ఎస్‌వీ రంగనాథ్ నియమితులయ్యారు.
అలాగే తాత్కాలిక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా నితిన్ బాగ్మానే నియమితులయ్యారు. సిద్ధార్థ భార్య మాళవిక హెగ్డే డెరైక్టరుగా ఉన్న సీసీడీ బోర్డు జూలై 31న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రంగనాథ్, నితిన్ బాగ్మానే, సీఎఫ్‌వో ఆర్ రామ్మోహన్‌తో కలిపి ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కాఫీ డే గ్రూప్ రుణభారాన్ని తగ్గించేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై ఈ కమిటీ దృష్టి పెట్టనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సీసీడీ తాత్కాలిక చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : ఎస్‌వీ రంగనాథ్
Published date : 01 Aug 2019 05:42PM

Photo Stories