సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేస్తోన్న రెండో టీకా పేరు?
Sakshi Education
కోవిడ్-19ను నిలువరించేందుకు ‘‘కోవోవ్యాక్స్’’ అనే మరో టీకాను 2021, జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) జనవరి 30న ప్రకటించింది.
నోవావ్యాక్స్ సంస్థతో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ టీకా పనితీరు అద్భుతంగా ఉందని తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రా జెనెకా ఉమ్మడిగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకాను ఎస్‌ఐఐ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్ టీకాలను ఇస్తున్నారు. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవోవ్యాక్స్పేరుతో టీకా ఉత్పత్తి
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)
ఎక్కడ : భారత్
ఎందుకు : కోవిడ్-19ను నిలువరించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవోవ్యాక్స్పేరుతో టీకా ఉత్పత్తి
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)
ఎక్కడ : భారత్
ఎందుకు : కోవిడ్-19ను నిలువరించేందుకు
Published date : 03 Feb 2021 05:32PM