Skip to main content

సీపీఈసీ కేవలం ఆర్థిక అంశం మాత్రమే

చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) నిర్మాణం కేవలం ఆర్థికపరమైన అంశమేనని, ఏదైనా దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఈ కారిడార్ లక్ష్యంగా చేసుకోదని ఏప్రిల్ 19న చైనా స్పష్టం చేసింది.
ఏప్రిల్ 25 నుంచి 27 వరకు చైనా రాజధాని బీజింగ్‌లో బీఆర్‌ఎఫ్ సదస్సుని నిర్వహించనున్న నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ మేరకు వ్యాఖ్యానించారు. సీపీఈసీకు కశ్మీర్ సమస్య పట్ల ఎటువంటి నిర్లక్ష్య ధోరణి లేదని తెలిపారు. బీఆర్‌ఎఫ్‌లో 37 దేశాల అగ్ర నేతలు, 150 దేశాల ప్రతినిధులు, 90 అంతర్జాతీయ సంస్థలతో కలిసి మొత్తం 5,000 మంది పాల్గొననున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సీపీఈసీ కేవలం ఆర్థిక అంశం మాత్రమే
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : చైనా
Published date : 20 Apr 2019 05:30PM

Photo Stories