సీనియర్ పాత్రికేయులు దీక్షితులు కన్నుమూత
Sakshi Education
సీనియర్ పాత్రికేయులు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ వి.వాసుదేవ దీక్షితులు (76) గుండెపోటు కారణంగా హైదరాబాద్‌లో ఏప్రిల్ 12న కన్నుమూశారు.
1942లో తూర్పుగోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, మొసలిపల్లిలో జన్మించిన ఆయన బీఎస్సీ చదివారు. తొలుత సైన్యంలో చేరిన దీక్షితులు 1967లో ఆంధ్రప్రభ పత్రికలో ట్రైనీ సబ్‌ఎడిటర్‌గా చేరారు. అదే పత్రికలో అంచెలంచెలుగా ఎదుగుతూ 1992లో ఎడిటర్ అయ్యారు. 1999లో అదే హోదాలో పదవీ విరమణ చేశారు. ఆయన సంపాదకీయాల సంపుటి ‘ఖడ్గధార’ పాఠకుల ఆదరణను చూరగొంది. పత్రికా రంగంలో విశ్లేషణ, విమర్శకుడిగా పేరు గడించిన దీక్షితులు మద్రాసు తెలుగు అకాడమీ నుంచి ఖాసా పురస్కారాన్ని అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీనియర్ పాత్రికేయులు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : వి.వాసుదేవ దీక్షితులు (76)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీనియర్ పాత్రికేయులు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : వి.వాసుదేవ దీక్షితులు (76)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు కారణంగా
Published date : 13 Apr 2019 05:03PM