సీజేఐ కార్యాలయంపై కుట్ర : జస్టిస్ గొగోయ్
Sakshi Education
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) కార్యాలయాన్ని అస్థిరపరిచేందుకు ఓ బలీయమైన శక్తి కుట్ర పన్నుతోందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఏప్రిల్ 20న ఆరోపించారు.
జస్టిస్ గొగోయ్ తనను లైంగికంగా వేధించారంటూ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్(జేసీఏ)గా పనిచేసిన ఓ మహిళ(35) 22 మంది సుప్రీంకోర్టు జడ్జీలకు లేఖ రాయడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో తన సారథ్యంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటుచేసిన గొగోయ్.. అత్యవసరంగా విచారణను చేపట్టారు. ఈ కేసులో ఉత్తర్వులు ఇచ్చే అధికారాన్ని సీనియర్ జడ్జి జస్టిస్ మిశ్రాకు వదిలిపెడుతున్నానని, ఇందులో నేను భాగం కాబోనని సీజేఐ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీజేఐ కార్యాలయంపై కుట్ర
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీజేఐ కార్యాలయంపై కుట్ర
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్
Published date : 22 Apr 2019 05:48PM