Skip to main content

సీఎస్‌ఆర్‌ నిబంధనలకు కేంద్రం సవరణలు

కరోనా వైరస్‌ నివారణ దిశగా టీకాలు (వ్యాక్సిన్లు), ఔషధాల అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
Current Affairs
కోవిడ్‌–19కు సంబంధించిన నూతన టీకాలు, ఔషధాలు, వైద్య పరికరాల పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కార్యక్రమాలను కార్పొరేట్‌ సామాజిక బాధ్యత పథకం (సీఎస్‌ఆర్‌) పరిధిలోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి నిబంధనలను సవరించింది. మూడు ఆర్థిక సంవత్సరాల (2020–21, 2021–22, 2022–23) వరకు కొన్ని షరతుల మేరకు ఇది అమలవుతుంది. ఈ చర్య వైద్య పరిశోధన సంస్థలకు ప్రోత్సాహాన్నిచ్చేది కానుంది. కంపెనీలు గత మూడేళ్ల కాలంలో పొందిన వార్షిక సగటు లాభాల్లోంచి 2 శాతాన్ని తప్పకుండా సీఎస్‌ఆర్‌ కింద సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలన్నది కంపెనీల చట్టం నిబంధనల్లో ఉంది.

యూఎస్‌ ఓపెన్ కు ఒస్టాపెంకో దూరం
ప్రతిష్టాత్మక యూఎస్‌ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు మరో స్టార్‌ క్రీడాకారిణి దూరమైంది. ఆగస్టు 31న న్యూయార్క్‌లో మొదలయ్యే ఈ మెగా టోర్నీలో తాను ఆడటం లేదని 2017 ఫ్రెంచ్‌ ఓపెన్ చాంపియన్, ప్రపంచ 42వ ర్యాంకర్‌ జెలెనాఒస్టాపెంకో ఆగస్టు 25న ప్రకటించింది. తన వ్యక్తిగత షెడ్యూల్‌లో మార్పు కారణంగానే తానీ నిర్ణయం తీసుకున్నానని 23 ఏళ్ల ఒస్టాపెంకో తెలిపింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో... ఇప్పటికే యూఎస్‌ ఓపెన్ నుంచి ప్రపంచ నంబర్‌వన్యాష్లేబార్టీ (ఆ్రస్టేలియా), రెండో ర్యాంకర్‌ హలెప్‌ (రొమేనియా), డిఫెండింగ్‌ చాంపియన్ బియాంకాఆండ్రెస్కూ (కెనడా), ఐదో ర్యాంకర్‌ స్వితోలినా (ఉక్రెయిన్), ఏడో ర్యాంకర్‌ కికిబెర్‌టె¯Œ్స (నెదర్లాండ్స్‌), ఎనిమిదో ర్యాంకర్‌ బెలిండా బెన్ చిచ్‌ (స్విట్జర్లాండ్‌) వైదొలిగారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఎస్‌ఆర్‌ నిబంధనలకుసవరణలు
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు :కేంద్ర ప్రభుత్వం
ఎందుకు :కరోనా వైరస్‌ నివారణ దిశగా టీకాలు (వ్యాక్సిన్లు), ఔషధాల అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు
Published date : 26 Aug 2020 04:54PM

Photo Stories