Skip to main content

సీఎస్‌ఐఆర్ టెక్నాలజీ అవార్డు-2020 విజేత?

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కి ప్రతిష్టాత్మక శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్) టెక్నాలజీ అవార్డు దక్కింది.
Current Affairs
కరోనా చికిత్సకు వాడుతున్న ఫావిపిరవిర్ మందును చౌకగా తయారు చేసేందుకు అవసరమైన పద్ధతులను అభివృద్ధి చేసినందుకుగాను ఈ అవార్డు వరించింది. ఆరోగ్య రంగంలో చేసిన పరిశోధనలకు డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ నేతృత్వంలోని ఐఐసీటీకి 2020 సంవత్సరానికి ఈ అవార్డును అందజేస్తున్నట్లు సీఎస్‌ఐఆర్ సెప్టెంబర్ 26న ఒక ప్రకటనలో తెలిపింది. సీఎస్‌ఐఆర్ 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల శాఖ మంత్రి హర్షవర్ధన్ ఢిల్లీలో ఈ అవార్డులను ప్రకటించారు.

చంద్రశేఖర్‌కు గ్రాంట్...
ఐఐసీటీ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తొలి సీఎస్‌ఐఆర్-ఆవ్రా చైర్ ప్రొఫెసర్ గ్రాంట్‌కు ఎంపికయ్యారు. ఏటా రూ.10 లక్షల చొప్పున మూడేళ్లపాటు మొత్తం రూ.30 లక్షల నగదు ఈ గ్రాంట్‌లో భాగంగా లభిస్తుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : సీఎస్‌ఐఆర్ టెక్నాలజీ అవార్డు-2020 విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : కరోనా చికిత్సకు వాడుతున్న ఫావిపిరవిర్ మందును చౌకగా తయారు చేసేందుకు అవసరమైన పద్ధతులను అభివృద్ధి చేసినందుకుగాను
Published date : 29 Sep 2020 01:30PM

Photo Stories