Skip to main content

సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం పొడిగింపు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ కాలాన్ని 3 నెలల పాటు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
Current Affairs
సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ కాలం 2021, జూన్‌ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో దాస్‌ పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా సీఎం చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన పదవీ కాలాన్ని జూలై 1 నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్‌ 26న ఆదేశాలు జారీ చేసింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ కాలం పొడిగింపు
ఎప్పుడు : జూన్‌ 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : 2021, జూన్‌ నెలాఖరుతో ఆయన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో...
Published date : 28 Jun 2021 06:11PM

Photo Stories