Skip to main content

సీఏఏపై వివరణ ఇచ్చాం : విదేశాంగ శాఖ

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్ (ఎన్నార్సీ)లకు సంబంధించి ప్రపంచ దేశాలకు వివరణ ఇచ్చామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ జనవరి 2న తెలిపారు.
Current Affairsసీఏఏ, ఎన్నార్సీ భారత అంతర్గత వ్యవహారమని వివరించామని పేర్కొన్నారు. వివిధ దేశాల్లోని భారతీయ రాయబారులు, ఇతర హై కమిషన్ అధికారులు ఆయా ప్రభుత్వాలకు, అక్కడి మీడియాకు సీఏఏ, ఎన్నార్సీలకు సంబంధించి అవగాహన కల్పించారని వివరించారు. విదేశీ మీడియా ప్రచారం చేస్తున్నట్లు.. ఎన్నార్సీ చట్టం వల్ల భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఎలాంటి భంగం కలగబోదని చెప్పామన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సీఏఏ, ఎన్నార్సీలపై ప్రపంచ దేశాలకు వివరణ ఇచ్చాం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : భారత విదేశాంగ శాఖ

మాదిరి ప్రశ్నలు
Published date : 03 Jan 2020 06:01PM

Photo Stories