Skip to main content

సీఐఐ సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్

భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) న్యూఢిల్లీ జూన్ 6న నిర్వహించిన సద స్సులో విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా సీఐఐ సదస్సులోజై శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం(సార్క్)తో కొన్ని సమస్యలున్న నేపథ్యంలో బిమ్స్‌టెక్ దేశాల సాయంతో ప్రాంతీయ సహకారాన్ని మెరుగు పరుచుకునేందుకు భారత్ కృషి చేస్తుందని తెలిపారు. అంతర్జాతీయంగా సంభవించిన పరిణామాలు మారిన సమీకరణాలతో చైనా ప్రాముఖ్యం పెరిగిందని, అదేవిధంగా భారత్ పలుకుబడి కూడా విస్తరించిందని అన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సీఐఐ సదస్సులో విదేశాంగ శాఖ మంత్రి
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : జైశంకర్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 07 Jun 2019 05:43PM

Photo Stories