Skip to main content

సచివాలయం కొత్త భవన నిర్మాణానికి ఆమోదం

తెలంగాణ రాష్ట్ర సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ర్ట కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన డిజైన్లను ఆమోదించింది.
Edu news ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆగస్టు 5న ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమై ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్‌–బీపాస్‌ పాలసీని కూడా మంత్రివర్గం ఆమోదించింది.

కేబినెట్ నిర్ణయాలు..
- కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు డిజిటల్‌ క్లాసులు నిర్వహించాలి. ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలి
- గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పాత విద్యుత్‌ బిల్లుల బకాయిలను వన్ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలి
- ప్రభుత్వ శాఖలకు చెందిన పనికిరాని పాత వాహనాలను అమ్మేయడానికి ఆమోదం
- దుమ్ముగూడెం బ్యారేజికి సీతమ్మ సాగర్, బస్వాపూర్‌ రిజర్వాయర్‌కు నృసింహ స్వామి రిజర్వాయర్, తుపాకులగూడం బ్యారేజికి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ తీర్మానం
- కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో 2020 ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలి

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణ రాష్ట్ర సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : తెలంగాణ కేబినెట్
Published date : 07 Aug 2020 03:52PM

Photo Stories