సౌదీ చమురు క్షేత్రాలపై ఉగ్రదాడి
Sakshi Education
సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాల్లో సెప్టెంబర్ 14న ఉగ్రవాదులు డ్రోన్ దాడులు జరిపారు.
సౌదీ తూర్పు ప్రాంతంలో ఆరామ్‌కోకు చెందిన అబ్కేయిక్, ఖురైస్ క్షేత్రాలపై సెప్టెంబర్ 14న రెండు డ్రోన్లు కూలాయి. దీంతో భారీగా చెలరేగిన మంటలను సిబ్బంది దాదాపు రెండు గంటల అనంతరం అదుపులోకి తెచ్చారని ప్రభుత్వం తెలిపింది. ఈ దాడికి కారణం తామేనంటూ ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న యెమెన్‌లోని హౌతి ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు.
ఇటీవలి కాలంలో హౌతి ఉగ్రవాదులు సౌదీ అరేబియా వైమానిక స్థావరాలపై పలు క్షిపణి, డ్రోన్ దాడులు జరిపిన విషయం తెలిసిందే. యెమెన్‌లో తమ ప్రాంతాలపై సౌదీ అరేబియా దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు హౌతీలు అంటున్నారు. ఆరామ్‌కోకు ఉన్న అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటైన అబ్కేయిక్‌పై గతంలో అల్‌ఖైదా జరిపిన దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు.

Published date : 16 Sep 2019 05:35PM