సైనిక దళాధిపతిగా జనరల్ మనోజ్ ముకుంద్
Sakshi Education
దేశ 28వ సైనిక దళాధిపతిగా జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ను కొత్తగా ఏర్పాటైన చీఫ్ ఆఫ్ డిఫెన్‌స స్టాప్ (సీడీఎస్)కు అధిపతిగా కేంద్ర ప్రభుత్వం నియమించడంతో..
ఆర్మీ వైస్‌చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ... పొరుగుదేశం ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం మానని పక్షంలో ఆ దేశంలోని ఉగ్రమూలాలను దెబ్బతీసే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేశారు.
మనోజ్ ముకుంద్ నరవాణే నేపథ్యం..
మహారాష్ట్రలోని పుణేకు చెందిన 59 ఏళ్ల మనోజ్ నేషనల్ డిఫెన్‌స అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీల్లో శిక్షణ పొందారు. 1980లో సిఖ్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ 7వ బెటాలియన్‌లో చేరారు. 37 ఏళ్ల సర్వీసులో చైనాతో 4వేల కిలోమీటర్ల మేర సరిహద్దు ఉన్న ఈస్టర్న్ కమాండ్‌తోపాటు పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లలో ఉగ్రవ్యతిరేక చర్యల్లో పాల్గొన్నారు. కశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. శ్రీలంక వెళ్లిన శాంతి పరిరక్షణ దళంలోనూ, మయన్మార్‌లోను మూడేళ్లపాటు పనిచేశారు. సేనా పతకం, విశిష్ట సేవా, అతి విశిష్ట సేవా పతకాలను ఈయన అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశ 28వ సైనిక దళాధిపతిగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే
మాదిరి ప్రశ్నలు

1. దేశ మొట్టమొదటి రక్షణ బలగాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్‌స స్టాఫ్ - సీడీఎస్)గా ఎవరు నియమితులయ్యారు?
1. జనరల్ బిపిన్ రావత్
2. జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే
3. అడ్మిరల్ కరంబీర్ సింగ్
4. ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కే భదౌరియా
1. జనరల్ బిపిన్ రావత్
2. జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే
3. అడ్మిరల్ కరంబీర్ సింగ్
4. ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కే భదౌరియా
- View Answer
- సమాధానం: 1
2. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఏ నగరంలో ఉంది?
1. హైదరాబాద్
2. డెహ్రాడూన్
3. సిమ్లా
4. చెన్నై
- View Answer
- సమాధానం: 2
Published date : 01 Jan 2020 07:33PM