Skip to main content

షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్‌పై నాలుగేళ్ల నిషేధం

ఆసియా చాంపియన్‌గా నిలిచిన షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్‌పై జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) నాలుగు సంవత్సరాల పాటు నిషేధం విధించింది.
డోపింగ్‌కు పాల్పడినందుకు ఆమెపై నిషేధం విధించినట్లు నాడా డెరైక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ఏప్రిల్ 9న తెలిపారు. ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన జూలై 20, 2017నుంచి తాజా శిక్ష అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. 2017లో మన్‌ప్రీత్ నాలుగు సార్లు డోపింగ్ పరీక్షల్లో విఫలమైంది.

శాంపుల్ సేకరించిన నాటి నుంచి మన్‌ప్రీత్ అన్ని ఫలితాలు చెల్లవంటూ నాడా ప్యానెల్ తీర్పునివ్వడంతో 2017లో గెలుచుకున్న ఆసియా చాంపియన్‌షిప్ స్వర్ణంతో పాటు జాతీయ రికార్డును కూడా మన్‌ప్రీత్ కోల్పోనుంది. షాట్‌పుట్‌లో 18.86 మీటర్ల రికార్డు ఆమె పేరిటే ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్‌పై నాలుగేళ్ల నిషేధం
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా)
ఎందుకు : డోపింగ్‌కు పాల్పడినందుకు
Published date : 10 Apr 2019 04:32PM

Photo Stories