Skip to main content

శానిటైజర్‌ను బంతికి అంటించి నిషేధానికి గురైన క్రికెటర్?

స్వింగ్‌ను రాబట్టేందుకు తన వద్ద ఉన్న హ్యాండ్ శానిటైజర్‌ను బంతికి అంటించడంతో... ఇంగ్లండ్ కౌంటీ ప్లేయర్ మిచ్ క్లేడన్ నిషేధానికి గురయ్యాడు.
Current Affairs
సస్సెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతడు... 2020, ఆగస్టు నెలలో జరిగిన ఒక మ్యాచ్‌లో బంతికి శానిటైజర్‌ను పూసి బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు దక్కించుకున్నాడు. కరోనా నేపథ్యంలో బంతికి ఉమ్మితో సహా ఎటువంటి పదార్థాలను రాయకూడదనే నిబంధనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రవేశపెట్టింది. దాంతో ఆస్ట్రేలియాలో జన్మించిన 37 ఏళ్ల క్లేడన్‌పై ఆగ్రహించిన సస్సెక్స్ జట్టు అతడిపై వేటు వేస్తున్నట్లు సెప్టెంబర్ 6న ప్రకటించింది. దీనిపై ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా విచారణ జరిపిస్తోంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : శానిటైజర్‌ను బంతికి అంటించి నిషేధానికి గురైన క్రికెటర్
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఇంగ్లండ్ కౌంటీ ప్లేయర్ మిచ్ క్లేడన్
Published date : 07 Sep 2020 09:34PM

Photo Stories