రూ. 68,607 కోట్ల రుణాలు రైటాఫ్: ఆర్‌బీఐ
ఈ లిస్టులో విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి వ్యాపారవేత్తలకు చెందిన సంస్థలు కూడా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వచ్చిన దరఖాస్తుకు సంబంధించి ఆర్‌బీఐ ఏప్రిల్ 24న ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 2019, సెప్టెంబర్ 30 నాటి వరకు గణాంకాల ప్రకారం.. టాప్ 50 లిస్టులో.. గీతాంజలి జెమ్స్ (పరారీలో ఉన్న చోక్సీకి చెందిన సంస్థ) అత్యధికంగా రూ. 5,492 కోట్ల బాకీలు చెల్లించాల్సి ఉంది. ఆర్‌ఈఐ ఆగ్రో రూ. 4,314 కోట్లు, విన్‌సమ్ డైమండ్స్ రూ. 4,076 కోట్లు కట్టాల్సి ఉంది. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 1,943 కోట్ల బాకీలతో 9వ స్థానంలో ఉంది. ఇక డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ రూ. 1,962 కోట్లు, ట్రాన్స్‌ట్రాయ్ రూ. 1,790 కోట్లు బాకీ పడ్డాయి. ఆర్‌టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిబ్రవరి 16న ఎగవేతదారుల వివరాల కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేశారు. ఆ వివరాలను ఆర్‌బీఐ తాజాగా తెలిపింది.
టాప్–10ఎగవేతదారులు..
సంస్థ | రూ. కోట్లలో |
గీతాంజలి జెమ్స్ | 5,492 |
ఆర్‌ఈఐ ఆగ్రో | 4,314 |
విన్‌సమ్ డైమండ్స్ | 4,076 |
రోటోమాక్ గ్లోబల్ | 2,950 |
కుడోస్ కెమీ | 2,326 |
రుచి సోయా | 2,212 |
జూమ్ డెవలపర్స్ | 2,012 |
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ | 1,943 |
ఫరెవర్ ప్రెషియస్ | 1,962 |
డెక్కన్ క్రానికల్ | 1,915 |