Skip to main content

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కిమ్ సమావేశం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సమావేశమయ్యారు.
రష్యాలో వ్లాదివోస్తోక్ నగరంలోని ఫార్ ఈస్ట్ స్టేట్ యూనివర్సిటీలో ఏప్రిల్ 25న జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక , అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు మద్దతు ఇస్తున్నట్లు ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. 2011లో కిమ్ పాలనాపగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన సమావేశమైన ఆరో దేశాధినేత పుతిన్ మాత్రమే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రష్యా అధ్యక్షుడితో ఉత్తర కొరియా అధ్యక్షుడు సమావేశం
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్
ఎక్కడ : ఫార్ ఈస్ట్ స్టేట్ యూనివర్సిటీ, వ్లాదివోస్తోక్, రష్యా
Published date : 26 Apr 2019 06:43PM

Photo Stories