రియల్ టైమ్ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
Sakshi Education
రియల్ టైమ్ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం దక్కించుకుంది.
రోజుకు 4.1 కోట్ల పైచిలుకు లావాదేవీలు నమోదు చేసింది. 2019 ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు. అంతర్జాతీయంగా బ్యాంకులు, వ్యాపార సంస్థలకు టెక్నాలజీ సేవలు అందించే ఎఫ్‌ఐఎస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
24 దేశాల్లో...
ఎలాంటి జాప్యం లేకుండా చెల్లింపుల లావాదేవీలు క్షణాల్లో పూర్తయ్యే ప్రక్రియను రియల్-టైమ్‌గా వ్యవహరిస్తారు. భారత్, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా తదితర 24 దేశాల్లో ఇలాంటి చెల్లింపుల విధానానికి సంబంధించి ఎఫ్‌ఐఎస్ సర్వీసులు అందిస్తోంది.
వృద్ధి రేటు ప్రకారం చూస్తే...
ఎఫ్‌ఐఎస్ నివేదిక ప్రకారం... వార్షికంగా ఆరు దేశాల్లో రియల్-టైమ్ చెల్లింపుల లావాదేవీలు రెట్టింపయ్యాయి. విలువపరంగా చూస్తే నాలుగు దేశాల్లో రెండు రెట్లు పెరిగాయి. వృద్ధి రేటు ప్రకారం చూస్తే మాత్రం 657 శాతం వృద్ధితో బహ్రెయిన్, ఘనా (488 శాతం), ఫిలిప్పీన్స్ (309 శాతం) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రియల్ టైమ్ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో అగ్రస్థానంలో నిలిచిన దేశం
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : భారత్
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా

Published date : 08 Oct 2020 05:30PM