రహదారుల నిర్మాణ వేగవంతంలో భారత్ ప్రపంచ రికార్డు
Sakshi Education
వేగవంతంగా రహదారుల నిర్మాణంలో భారత్ గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) ప్రపంచ రికార్డు సాధించిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏప్రిల్ 2న తెలిపారు.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకూ 13,394 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరిపిందనీ, రోజూవారీ సగటు 37 కిలోమీటర్లని ఆయన వివరించారు. తాను రహదారుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి రోజుకు 2 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం మాత్రమే ఉండేదని పేర్కొన్నారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
- న రహదారుల నిర్మాణంతోసహా మొత్తం మూడు అంశాల విషయంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులను భారత్ నమోదు చేసింది.
- 2014 ఏప్రిల్ నాటికి భారత్ రహదారుల నిర్మాణం 91,287 కిలోమీటర్లు ఉంటే, 2021 మార్చి 20 నాటికి ఈ పొడవు 1,37,625 కిలోమీటర్లకు చేరింది.
- 2014–15లో రహదారుల నిర్మాణానికి కేటాయింపులు రూ.33,414 కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధుల పరిమాణం 5.5 రెట్టు పెరిగి రూ.1,83,101 కోట్లకు ఎగసింది.
- భారత్‌మాల పరియోజన బృహత్తర ప్రణాళిక కింద దాదాపు రూ.5.35 లక్షల కోట్లతో 34,800 కిలోమీటర్ల నిర్మాణం కేంద్రం లక్ష్యం.
Published date : 03 Apr 2021 05:33PM