రెపో రేటు అంటే? ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2 నుంచి 4 వరకు వరుసగా మూడు రోజులు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఆర్‌బీఐ-ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి. దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించనున్నట్లు ఆర్‌బీఐ ఎంపీసీ వెల్లడించింది.
ఆర్‌బీఐ పాలసీ రేట్ల తీరు ఇదీ...
రెపో రేటు అంటే ఏమిటీ?
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
ద్రవ్యోల్బణం...
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆర్‌బీఐ ఎంపీసీ తాజా నిర్ణయాలను తీసుకుంది. ఆర్‌బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం స్థాయిలో ఉండాలి. అయితే ప్రస్తుతం దీనికి మించి కొనసాగుతోంది.
ఆర్‌బీఐ-ఎంపీసీ నిర్ణయాలు...
- 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణత 7.5 శాతం ఉంటుందని అంచనా.
- కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2,000 నుంచి రూ.5,000కు పెంపు. డిసెంబర్ 14వ తేదీ నుంచి ఇది అమలు.
- భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ (ఆర్‌టీజీఎస్) ఇక నిరంతరాయంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్ సేవలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య అందుబాటులో ఉంటున్నాయి.