రేప్ కేసుల విచారణపై సుప్రీం కమిటీ
Sakshi Education
దేశవ్యాప్తంగా కోర్టుల్లో అత్యాచార ఘటనల కేసుల విచారణ ఎంత సత్వరంగా జరుగుతోందో పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే డిసెంబర్ 16న నియమించారు. మహిళలు, చిన్నారులపై పెరిగిపోతున్న లైంగికదాడులు, సంచలనం రేపిన ‘దిశ’ కేసులో నలుగురు నిందితులు ఎదురు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రేప్ కేసుల విచారణపై కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : దేశవ్యాప్తంగా కోర్టుల్లో అత్యాచార ఘటనల కేసుల విచారణ ఎంత సత్వరంగా జరుగుతోందో పరిశీలించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : రేప్ కేసుల విచారణపై కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : దేశవ్యాప్తంగా కోర్టుల్లో అత్యాచార ఘటనల కేసుల విచారణ ఎంత సత్వరంగా జరుగుతోందో పరిశీలించేందుకు
Published date : 17 Dec 2019 05:51PM