Skip to main content

రైతులు, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల్లో పురోగతి

వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రద్దు సహా నాలుగు ప్రధాన డిమాండ్లపై కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య డిసెంబర్ 30న జరిగిన చర్చల్లో కొంత పురోగతి చోటు చేసుకుంది.
Current Affairs
రైతుల ప్రధానమైన 4 డిమాండ్లలో.. రెండు డిమాండ్ల అమలుకు ప్రభుత్వం అంగీకరించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్, సోం ప్రకాశ్... సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులైన 40 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇరు వర్గాల మధ్య ఇవి ఆరో విడత చర్చలు. తదుపరి 2021, జనవరి 4న జరగనున్నాయి.

చదవండి: వివాదస్పద వ్యవసాయ చట్టాలు-వివరాలు


రైతుల డిమాండ్లు - ప్రభుత్వ స్పందన
అంగీకారం కుదిరిన అంశాలు
1) కొత్త విద్యుత్ చట్టం: రాష్ట్రాలు రైతులకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ కొనసాగాలన్న రైతుల డిమాండ్‌కు అంగీకారం. సంబంధిత విద్యుత్ సవరణ బిల్లుపై వెనక్కు.
2) వాయు కాలుష్యం: దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ లో పంట వ్యర్థాలను దహనం చేస్తే రైతులకు జరిమానా విధించే ప్రతిపాదన తొలగింపునకు ప్రభుత్వం అంగీకారం.

అంగీకారం కుదరని అంశాలు
1) నూతన వ్యవసాయ చట్టాల రద్దు: కుదరని ఏకాభిప్రాయం. చట్టాల రద్దుకు ప్రభుత్వం ససేమిరా. రైతుల అభ్యంతరాలపై కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ ప్రతిపాదన. తోసిపుచ్చిన రైతు నేతలు. జనవరి 4న మళ్లీ చర్చ.
2) ఎమ్మెస్పీకి చట్టబద్ధత: ఎమ్మెస్పీని సమర్ధవంతంగా అమలు చేయడం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం. ఎమ్మెస్పీపై లిఖితపూర్వక హామీ ఇస్తామని వెల్లడి. తోసిపుచ్చిన రైతులు. ఎమ్మెస్పీ చట్టబద్ధత కోసం పట్టు. జనవరి 4న చర్చ.
Published date : 31 Dec 2020 06:01PM

Photo Stories