Skip to main content

రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించేందుకు ఉద్దేశించిన పథకం?

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ జలకళ’ పథకం ప్రారంభమైంది.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంంబర్ 28న తన క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు.
Current Affairs
ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులనుద్దేశించి సీఎం ప్రసంగిస్తూ... జలకళ ద్వారా అర్హులైన రైతులందరి పొలాల్లో ఉచితంగా బోర్లు వేయడంతో పాటు చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తామని పేర్కొన్నారు.

సీఎం ప్రసంగం
-ప్రధానాంశాలు
  • వైఎస్సార్ జలకళ పథకం కింద 144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్ నియోజకవర్గాలు.. మొత్తంగా 163 నియోజకవర్గాల్లో ఇవాళ బోరు యంత్రాలు ప్రారంభిస్తున్నాం.
  • రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల బోర్లు తవ్వడమే కాకుండా, వాటికి కేసింగ్ పైపులు కూడా వేస్తాం. ఈ పథకంపై వచ్చే 4 ఏళ్లలో రూ.2,340 కోట్లు ఖర్చు చేస్తాం.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ‘వైఎస్సార్ జలకళ’ పథకం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : రాష్ట్ర వ్యాప్తంగా
ఎందుకు : రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించేందుకు
Published date : 29 Sep 2020 05:39PM

Photo Stories