రైల్వేలో అన్నింటికీ ఒకటే హెల్ప్‌లైన్ నంబర్
Sakshi Education
భారత రైల్వేలో ఇకపై ఒకటే హెల్ప్‌లైన్ నంబర్ ఉండనుంది. ఈ మేరకు అన్ని సేవలకు 139 నంబర్ హెల్ప్‌లైన్‌గా పనిచేస్తుందని రైల్వేశాఖ జనవరి 2న ఓ ప్రకటనలో తెలిపింది.
182 నంబర్ మినహా మిగతా అన్ని హెల్ప్‌లైన్ నంబర్ల బదులు ఇకపై 139 పనిచేయనుంది. ఇది 12 భాషల్లో ఐవీఆర్‌ఎస్ పద్ధతి ద్వారా సేవలందించనుంది. ఇక 182 నంబర్ రైల్వే భద్రత కోసం పనిచేయనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రైల్వేలో అన్నింటికీ ఒకటే హెల్ప్‌లైన్ నంబర్
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : రైల్వేశాఖ
ఎందుకు : 182 నంబర్ మినహా మిగతా అన్ని హెల్ప్‌లైన్ నంబర్ల బదులు ఇకపై 139 పనిచేయనుంది
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : రైల్వేలో అన్నింటికీ ఒకటే హెల్ప్‌లైన్ నంబర్
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : రైల్వేశాఖ
ఎందుకు : 182 నంబర్ మినహా మిగతా అన్ని హెల్ప్‌లైన్ నంబర్ల బదులు ఇకపై 139 పనిచేయనుంది
మాదిరి ప్రశ్నలు
1. అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019, నవంబర్ 25న ప్రారంభించిన కాల్‌సెంటర్?
1. 14800
2. 14400
3. 13300
4. 14300
- View Answer
- సమాధానం : 2
2. బాల్య వివాహాలను నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా అస్సాం ప్రభుత్వం ఏ పేరుతో 2020, జనవరి 1 నుంచి నూతన పథకాన్ని అమల్లోకి తెచ్చింది?
1. అరుంధతి స్వర్ణ యోజన
2. కిశోర స్వర్ణ యోజన
3. బంగారు తల్లి పథకం
4. బాలికా వికాస్ యోజన
- View Answer
- సమాధానం : 1
Published date : 03 Jan 2020 05:54PM