Skip to main content

రైల్వేల సురక్షితమైన ఏడాదిగా 2019

2019 ఏడాది రైలు ప్రమాదాల వల్ల ఒక్క ప్రయాణికుడు కూడా మరణించలేదని భారతీయ రైల్వే ప్రకటించింది.
Current Affairsదీంతో రైల్వే చరిత్రలోనే ఈ ఏడాది చాలా సురక్షితమైనదిగా నమోదైందని రైల్వే అధికారులు డిసెంబర్ 27న వెల్లడించారు. సిబ్బంది చనిపోయారని, ప్రయాణికులు చనిపోలేదని తెలిపారు.
  • రైలు ప్రమాదాల వల్ల 2018-19 ఆర్థిక సంవత్సరంలో 16 మరణాలు, 2017-18లో 28, 2016-17 మధ్య కాలంలో 195 మరణాలు సంభవించాయి.
  • 1990-95 మధ్య కాలంలో సరాసరి ఏటా 500 రైల్వే ప్రమాదాలు జరిగేవి. ఈ ఐదేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 2,400 మరణాలు సంభవించగా, 4,300 మంది గాయపడ్డారు.
  • 2013-18 మధ్య కాలంలో ఏటా 110 ప్రమాదాలు జరగ్గా, ఈ ఐదేళ్లలో 990 మంది చనిపోగా, 1,500 మంది గాయపడ్డారు. కొన్నేళ్లుగా రైల్వేలో యాక్సిడెంట్లు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి.
Published date : 28 Dec 2019 06:10PM

Photo Stories