Skip to main content

రాష్ట్ర హోదా కోసం తీర్మానం చేసిన కేంద్రపాలిత ప్రాంతం

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలని పుదుచ్చేరి అసెంబ్లీలో జనవరి 18న తీర్మానం చేశారు.
Current Affairs
అలాగే కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించే తీర్మానానికి కూడా పుదుచ్చేరి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ, ముఖ్యమంత్రి గా వి. నారాయణ స్వామి ఉన్నారు.

చదవండి: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు - రాజధాని, గవర్నర్, ముఖ్యమంత్రులు

ఏపీ ఐపీఎస్‌లకు జాతీయ అవార్డులు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులకు ‘‘అంత్రిక్ సురక్ష సేవ పతకం-2020’’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులను కేంద్రం ఈ మెడల్స్‌కు ఎంపిక చేసింది. వీటిని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జనవరి 19న అందజేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలని తీర్మానం
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : పుదుచ్చేరి అసెంబ్లీ
Published date : 21 Jan 2021 04:20PM

Photo Stories