రామన్ మెగసెసె అవార్డీ డాక్టర్ శాంత కన్నుమూత
Sakshi Education
ప్రముఖ ఆంకాలజిస్ట్, శాస్త్రజ్ఞురాలు, చెన్నై అడయార్ క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్-హాస్పిటల్ చైర్మన్, పద్మవిభూషణ్ డాక్టర్ వి.శాంత (93) కన్నుమూశారు.
ఆస్తమాతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జనవరి 19న తుదిశ్వాస విడిచారు. నోబెల్ గ్రహీతలు సర్ సీవీ రామన్, సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ కుటుంబానికి చెందిన శాంత.. 1927 మార్చి 11న చెన్నైలోని మైలాపూర్‌లో జన్మించారు.
నోబెల్ బహుమతికి కూడా....
డాక్టర్ శాంత.. 1949లో మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. 1955లో అదే కాలేజీలో ఎండీ చదువు ముగించి వెంటనే వైద్యవృత్తిలోకి ప్రవేశించారు. 1955 నుంచి మరణించే వరకు క్యాన్సర్ రోగులకు తన సేవలు అందించారు. క్యాన్సర్‌పై పోరులో ఆమె చేసిన పరిశోధనలు, వైద్యరంగానికి ఆమె చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. రామన్ మెగెసెసె అవార్డును సైతం అందుకున్న శాంత... 2005లో నోబెల్ బహుమతికి కూడా నామినేట్ అయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మవిభూషణ్ అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : డాక్టర్ వి.శాంత (93)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : ఆస్తమా కారణంగా

Published date : 21 Jan 2021 04:16PM