Skip to main content

రాజస్తాన్ రాయల్స్ జట్టు మెంటార్‌గా నియమితులైన ఆస్ట్రేలియా క్రికెట‌ర్?

ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఇప్పటికే ప్రచారకర్తగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం షేన్‌వార్న్ ఇప్పుడు మరో పాత్రలోకి ప్రవేశిస్తున్నాడు.
Current Affairs
జట్టులోని యువ ఆటగాళ్లను తీర్చి దిద్దేందుకు వార్న్‌ను టీమ్ మెంటార్‌గా ఎంపిక చేసినట్లు సెప్టెంబర్ 13న ఫ్రాంచైజీ ప్రకటించింది. టీమ్ కోచ్, తన విక్టోరియా జట్టు మాజీ సహచరుడు అయిన ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో కలిసి వార్న్ పని చేస్తాడు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్‌ను 51 ఏళ్ల షేన్ వార్న్ నాయకత్వంలోనే రాజస్తాన్ గెలుచుకుంది. అప్పటినుంచి ఏదో ఒక రూపంలో టీమ్‌తో అతను తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రాజస్తాన్ రాయల్స్ జట్టు మెంటార్‌గా నియమితులైన ఆస్ట్రేలియా దిగ్గజం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : షేన్‌వార్న్
Published date : 14 Sep 2020 06:14PM

Photo Stories