రాజస్తాన్ హైకోర్టు నూతన భవనం ప్రారంభం
Sakshi Education
రాజస్తాన్ హైకోర్టులో నిర్మించిన నూతన భవనాన్ని డిసెంబర్ 7న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... ‘‘న్యాయ ప్రక్రియ బాగా ఖరీదైపోయింది. పలు కారణాల వల్ల సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టులు సాధారణ కక్షిదారులకు అందడం అసాధ్యంగా మారింది’’అని వ్యాఖ్యానించారు.
ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే ప్రసంగిస్తూ... న్యాయం ఎప్పుడూ ప్రతీకారంగా మారకూడదని, అలా మారినప్పుడు న్యాయానికి ఉన్న లక్షణాలేవీ మిగలవని తెలిపారు. న్యాయవ్యవస్థ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యం విషయంలో తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ మానభంగ కేసుల విచారణ సత్వరం జరిగేలా ప్రధాన న్యాయమూర్తి, ఇతర సీనియర్ న్యాయమూర్తులు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజస్తాన్ హైకోర్టు నూతన భవనం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్
ఎక్కడ : జోధ్‌పూర్, రాజస్తాన్

Published date : 09 Dec 2019 06:01PM