ఫుట్‌బాల్ ఆటగాళ్లలో అత్యధిక మొత్తం ఆర్జించిన క్రీడాకారుడు?
మెస్సీ 2020 ఏడాదిలో 12 కోట్ల 60 లక్షల డాలర్లు (రూ. 927 కోట్లు) ఆర్జించాడు. ఇందులో 9 కోట్ల 20 లక్షల డాలర్లు వేతనం ద్వారా రాగా... మిగతా 3 కోట్ల 40 లక్షల డాలర్లు వాణిజ్య ఒప్పందాల ద్వారా సంపాదించాడు. 15 ఏళ్ల నుంచి స్పెయిన్‌కు చెందిన విఖ్యాత క్లబ్ బార్సిలోనా జట్టుకు మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
రెండో స్థానంలో రొనాల్డో...
సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఫుట్‌బాలర్‌గా పేరున్న పోర్చు
గల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 11 కోట్ల 70 లక్షల డాలర్ల (రూ. 860 కోట్లు) ఆర్జనతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటలీలో యువెంటస్ క్లబ్‌కు ఆడుతున్న రొనాల్డో వేతనం ద్వారా 70 కోట్ల డాలర్లు... ఎండార్స్‌మెంట్ల ద్వారా 47 కోట్ల డాలర్లు పొందాడు.
అత్యధిక మొత్తం సంపాదించిన ఫుట్‌బాల్ ఆటగాళ్లు
ర్యాంక్ | ప్లేయర్ | దేశం/క్లబ్ | మొత్తం |
1 | మెస్సీ | అర్జెంటీనా/బార్సిలోనా | 12 కోట్ల 60 లక్షల డాలర్లు (రూ. 927 కోట్లు) |
2 | రొనాల్డో | పోర్చుగల్/యువెంటస్ | 11 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 860 కోట్లు) |
3 | నేమార్ | బ్రెజిల్/పీఎస్‌జీ | 9 కోట్ల 60 లక్షల డాలర్లు (రూ. 706 కోట్లు) |
4 | ఎంబాపె | ఫ్రాన్స్/పీఎస్‌జీ | 4 కోట్ల 20 లక్షల డాలరు (రూ. 309 కోట్లు) |
5 | సలా | ఈజిప్ట్/లివర్‌పూల్ | 3 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 272 కోట్లు) |
6 | పోగ్బా | ఫ్రాన్స్/మాంచెస్టర్ | 3 కోట్ల 40 లక్షల డాలర్లు (రూ. 250 కోట్లు) |
7 | గ్రీజ్‌మన్ | ఫ్రాన్స్/బార్సిలోనా | 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 242 కోట్లు) |
8 | బేల్ | వేల్స్/రియల్ మాడ్రిడ్ | 2 కోట్ల 90 లక్షల డాలర్లు (రూ. 213 కోట్లు) |
9 | లెవన్‌డౌస్సీ | పోలాండ్/మ్యూనిక్ | 2 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 206 కోట్లు) |
10 | డయెహ | స్పెయిన్/మాంచెస్టర్ | 2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 198 కోట్లు) |
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫుట్‌బాల్ ఆటగాళ్లలో అత్యధిక మొత్తం ఆర్జించిన క్రీడాకారుడు
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ లయెనల్ మెస్సీ