ఫ్రెంచ్ ఓపెన్ మహిళల విజేత బార్టీ
Sakshi Education
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి యాష్లే బార్టీ విజేతగా నిలిచింది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జూన్ 8న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ బార్టీ 6-1, 6-3తో అన్‌సీడెడ్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో యాష్లే బార్టీ 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. చివరిసారి 1973లో మార్గరెట్ కోర్ట్ ఈ వేదికపై ఆస్ట్రేలియాకు సింగిల్స్ టైటిల్‌ను అందించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : యాష్లే బార్టీ
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : యాష్లే బార్టీ
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
Published date : 10 Jun 2019 06:05PM