Skip to main content

ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ ఇకలేరు

దిగ్గజ పరుగుల వీరుడు, ఫ్లయింగ్‌ సిఖ్‌గా ఖ్యాతిగాంచిన భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌ (91) ఇకలేరు.
Current Affairs కరోనా అనంతర సమస్యలతో చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌)లో చికిత్స పొందుతూ జూన్‌ 18న తుదిశ్వాస విడిచారు. 1932 నవంబర్‌ 20న పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న గోవింద్‌పురలో మిల్కా జన్మిచారు. సిక్‌రాథోడ్‌ రాజపుత్రుల కుటుంబంలో జన్మించిన ఆయన 1951 ఏడాదిలో భారత సైన్యంలో చేరారు.
 
1959లో పద్మశ్రీ...
ఆర్మీ నిర్వహించిన పరుగులపోటీలో మిల్కా ఆరో స్థానంలో నిలిచారు. అనంతరం అథ్లెట్‌గా మారారు. అనంతరం 1958 కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి సత్తా చాటాడు. అనంతరం1958 టోక్యో, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు నెగ్గారు. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. త్రుటిలో ఒలింపిక్‌ పతకాన్ని కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 1959లో పద్మశ్రీతో సత్కరించింది.

అర్జున అవార్డు వద్దన్నాడు...
  • మన దేశంలో రన్నింగ్‌లో ‘ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌’ను ఇంట్రడ్యూస్‌ చేసింది మిల్కా సింగే.
  • కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచిన తర్వాత.. తన విజయానికి గౌరవంగా దేశవ్యాప్త సెలవు ప్రకటించాలన్న మిల్కా సింగ్‌ విజ్ఞప్తిని అప్పటి ప్రధాని నెహ్రూ సంతోషంగా అంగీకరించారు.
  • 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో నాలుగో స్థానంలో నిలిచాడు మిల్కా సింగ్‌. అయితే అప్పుడు ఆయన నెలకొల్నిన 45 సెకన్ల రికార్డు బ్రేక్‌ చేయడానికి మరో భారత రన్నర్‌కి 40 ఏళ్లు పట్టింది.
  • ఆసియా పరుగుల వీరుడి ట్యాగ్‌ దక్కించుకున్న అబ్దుల్‌ ఖలిక్‌పై 200 మీటర్లపరుగుపందెంలో విజయం సాధించాడు మిల్కా సింగ్‌. అది చూసి పాక్‌ జనరల్‌ ఆయూబ్‌ ఖాన్‌ ‘ఫ్లైయింగ్‌ సిక్‌’ అని పిలిచాడు. అప్పటి నుంచి అది ఆయన బిరుదు అయ్యింది.
  • మొత్తం 80 రేసుల్లో 77 విజయాలతో అరుదైన రికార్డు ఆయన సొంతమని చెప్తారు.
  • 2001లో కేంద్రం ఆయనకు అర్జున అవార్డు ప్రకటించగా.. ‘40 ఏళ్లు ఆలస్యమైంద’ని పేర్కొంటూ ఆయన తిరస్కరించారు.
  • ఆయన తన పతకాలన్నింటిని దేశానికే దానం చేశాడు. తొలుత ఢిల్లీ నెహ్రూ స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన వాటిని.. తర్వాత పటియాలాలోని స్పోర్ట్స్‌ మ్యూజియానికి తరలించారు.
  • 1999లో కార్గిల్‌ వార్‌లో అమరుడైన బిక్రమ్‌ సింగ్‌ ఏడేళ్ల కొడుకును మిల్కా సింగ్‌ దత్తత తీసుకున్నాడు
  • మిల్కా సింగ్‌ తన కూతురు సోనియా సాన్వాకాతో కలిసి ఆత్మకథ ‘ది రేస్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ రాసుకున్నాడు.
  • ది రేస్‌ ఆఫ్‌ మై లైఫ్‌ పుస్తకం బాలీవుడ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ మెహ్రా... ఫర్హాన్‌ అక్తర్‌ను లీడ్‌ రోల్‌ పెట్టి ‘భాగ్‌ మిల్కా భాగ్‌ ’ సినిమా తీశాడు.
  • భాగ్‌ మిల్కా భాగ్‌ సినిమా కోసం... మిల్కా తన బయోపిక్‌ హక్కుల్ని ఒక్క రూపాయికే ఇచ్చాడు. కానీ సినిమాకొచ్చే లాభాల్లో కొంత వాటాను పేద క్రీడాకారుల కోసం నెలకొల్పిన మిల్కా సింగ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌కి ఇవ్వాలనే షరతు విధించాడు.
Published date : 19 Jun 2021 12:01PM

Photo Stories