Skip to main content

ఫ్లెమింగో ఫెస్టివల్-2020 ప్రారంభం

విదేశీ విహంగాల విడిది కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని నేలపట్టులో ‘ఫ్లెమింగో ఫెస్టివల్-2020’ జనవరి 3న ప్రారంభమైంది.
Current Affairsమూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల ప్రారంభకార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండల కేంద్రాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభం
31వ విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభమైంది. విజయవాడ స్వరాజ్ మైదానంలో పది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. పుస్తకాలు భావితరాలకు విజ్ఞాన నిక్షేపాలు వంటివని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. అంతకుముందు తెలుగువారి చరిత్ర పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫ్లెమింగో ఫెస్టివల్-2020 ప్రారంభం
ఎప్పుడు : జనవరి 3
ఎక్కడ : సూళ్లూరుపేట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

మాదిరి ప్రశ్నలు
Published date : 04 Jan 2020 05:52PM

Photo Stories